రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోళు కేంద్రాల్లోనే పంటలను విక్రయించి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ శ్యామల దేవి అన్నారు. గురువారం పట్టణంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కందుల కొనుగోళు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఆమె ముఖ్య అథితిగా హాజరై ప్రారంభించారు. తొలి రైతును సత్కరించి తూకం వేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామల దేవి మాట్లాడుతూ… కందులకు ప్రభుత్వం క్వింటాళులకు రూ.7 వేల 550 ఇస్తుందన్నారు. రైతులు ప్రయివేట్ వ్యాపారులు, దళారులను నమ్మి మోసపోకుండా కేంద్రాల్లో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ యార్డులో తమ పంటను అమ్ముకొని మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ డీఎం ప్రవీణ్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, మార్కెట్ కార్యదర్శి మధుకర్, కేంద్రం ఇన్చార్జి పండరి పాల్గొన్నారు.