గాంధారి మండలంలోని కరాక్ వాడి గ్రామంలో శుక్రవారం ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. గ్రామసభకు విచ్చేసిన అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టరీ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందజేస్తామని అర్హులై ఉండి సంక్షేమ లిస్టులో పేరు లేనివారు, రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సతీష్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ చందర్ రావు, కాంగ్రెస్ నాయకులు ఉమాజీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.