
ప్రజాపాలన దరఖాస్తులు ఆన్ లైన్ పక్రియ పక్కాగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ టి. వీరారెడ్డి అన్నారు.శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తుల డేటా ఎంట్రీని ఆయన పరిశీలించారు. తప్పులు లేకుండా నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సరిత,తాసిల్దార్ శ్రీనివాసరావు, ఎంపీఓ శ్రీమాలిని, పర్యవేక్షలు జ్ఞాన ప్రకాష్ రెడ్డి ఉన్నారు.