పత్తి మిల్లులు సందర్శించిన అదనపు కలెక్టర్

Additional Collector visited cotton mills– సోయా పంట కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

– పంట ఆరబెట్టడానికి కొత్తగా ప్లాట్ ఫారాలు నిర్మించండి: అదనపు కలెక్టర్ కు రైతులు విన్నపం
– నవంబర్ మొదటి వారంలో సీసీఐ పత్తి కొనుగోలు ప్రారంభం కావాలి: అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం..
నవతెలంగాణ –  మద్నూర్
కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి శనివారం మద్నూర్ మార్కెట్ యార్డును సందర్శించి మద్దతు ధర సోయా పంట కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు చేసిన పంట లారీ లోడులు ఎందుకు నిలబడ్డాయి అని అధికారులకు అడిగి తెలుసుకున్నారు. మార్క్ ఫెడ్ అధికారులు పర్మిషన్ ఇవ్వాలని లారీలు ఎక్కడికి పంపాలనేది మార్క్ఫెడ్ అధికారులు ఆదేశాలు రానందున, లోడ్ అయిన లారీలు రెండు రోజులుగా ఇక్కడే ఉన్నాయని సింగిల్ విండో కార్యదర్శి బాబురావు అదనపు కలెక్టర్కు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంటనే స్పందించి మార్క్ఫెడ్ జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడారు. లోడు చేసిన లారీలు ఎక్కడికి పంపాలి అనేది పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిల్లా మార్క్ ఫెడ్ అధికారులు లోడ్ అయిన లారీలను పంపించే ప్రయత్నం చేస్తామని అధనం కలెక్టర్కు సమాధానం ఇచ్చారు. సోయా పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి మోసాలు జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సింగిల్ విండో కార్యదర్శి కి మార్కెట్ కమిటీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడి నుండి సిసిఐ పత్తి కొనుగోలు చేసే ప్రైవేట్ పత్తి మిల్లులను సందర్శించారు. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ మొదటివారంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభం కావడానికి చర్యలు చేపట్టాలని ఏఎంసి సెక్రటరీ రామ్నాథ్ను అదనపు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశా.రు అదనపు కలెక్టర్ వెంట మద్నూర్ మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ ఆర్ఐ శంకర్ మండల వ్యవసాయ అధికారి రాజు మార్కెట్ కమిటీ కార్యదర్శి రామ్నాథ్ సింగిల్ విండో కార్యదర్శి బాబురావు ఏఎంసి సూపర్వైజర్లు సత్యం రామ్ చందర్ మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు సచిన్ వ్యవసాయ రైతులు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.