డాగ్ గోల్డి మృతి పట్ల శ్రద్దాంజలి ఘటించిన అదనపు పోలీస్ కమీషనర్

Additional Commissioner of Police condoled the death of Dag Goldiనవతెలంగాణ – కంఠేశ్వర్ 
పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు విధులు నిర్వహించే డాగ్ గోల్డి (మందుపాతరలను గుర్తుపట్టేది) అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్  కల్మేశ్వర్ సింగినవార్, ఐ.పి.యస్, ఆదేశాల మేరకు అదనపు డి.సి.పి (అడ్మిన్)  బి. కోటేశ్వర్ రావ్ బుధవారం పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించి పోలీస్ బ్యాండ్తో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భగా అదనపు డి.సి.పి (అడ్మిన్)  మాట్లాడుతూ.. డాగ్ గోల్డి 2016 బ్యాచ్ నుండి విధులు నిర్వహిస్తుందని, ప్రెసిడెంటు, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్, అసెంబ్లీ, ఉప్పల్ స్టేడియం మొదలగు డ్యూటీలు నిర్వహించిందని అనేక పతకాలు మరియు ప్రశంసా పత్రములు రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన వారు ఆర్మూడ్ రిజర్వు ఎ.సి.పి  నాగయ్య, హోమ్ గార్డ్సు ఎ.సి.పి అరుణ్ కుమార్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ (అడ్మిన్) సతీష్, (ఎమ్.టి.ఓ) తిరుపతి, (వెల్ఫేర్) శ్రీనివాస్, జిల్లా వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ డా॥ హన్మంత్ రెడ్డి  డాగ్ స్కాడ్ సిబ్బంది మనోహర్, సాయన్న, జగదీష్, మోహన్, శ్రీకాంత్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.