గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అదనపు పోలీస్ కమీషనర్లు

Additional Commissioners of Police inspected Group 3 Examination Centresనవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గ్రూప్ 3 పరీక్షల నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి ప్రారంభం కాగా నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సి. హెచ్. సింధూశర్మ, ఐ.పి.యస్. ఆదేశాల మేరకు అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్) కోటేశ్వర రావు అదనపు పోలీస్కమీషనర్ ( లా అండ్ ఆర్డర్ ) బస్వారెడ్డి అదనపు పోలీస్ కమీషనర్ (ఎ.ఆర్ ) శంకర్ నాయక్  ఆధ్వర్యంలో వివిధ కళాశాలల లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి పలుసూచనలు చేశారు. 66 పరీక్షా కేంద్రాలలో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఈ సందర్భంగా ఎ.సి. పిలు, సి.ఐలు, ఎస్.ఐలు సిబ్బంది విధినిర్వాహణలో ఉన్నారు.