కేశవపట్నం పోలీస్ స్టేషన్లను సందర్శించిన అడిషనల్ డీసీపీ

నవతెలంగాణ -శంకరపట్నం
ప్రజలకు సంబంధించిన కేసులను తొందరగా పరిష్కారం చేయాలని అడిషనల్ డిసిపి ఏ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్లో పలు కేసుల  రికార్డులను పరిశీలించి సిబ్బందికి సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ స్టేషన్లో కేసులు అన్నింటి పైన నిగపెట్టి ఉంచాలన్నారు. స్టేషన్లో ఉన్న కేసులను తొందరగా పరిష్కరించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు ఒగాన కల్పిస్తూ చైతన్య పరుస్తూ   జాగ్రత్తగా ఉండేలా చేయాలని తెలిపారు. అలాగే గ్రామాలలో బ్లూ కోర్టు సిబ్బంది గస్తీ నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సిఐ బి ప్రశాంత్ కుమార్, ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది  పాల్గొన్నారు.