
అనుముల మండలంలోని హాలియాలో సాయి ప్రతాప్ నగర్ రెడ్డి కాలనీ బొడ్రాయి బజార్ లో మంగళవారం జరుగుతున్న ఇంటింటి ఓటరు జాబితా సర్వే సవరణలలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ రెవెన్యూ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని మొత్తం ఓటర్లు 9376 మందికి గాను 25% బిఎల్వో ఆన్లైన్ చేయడం జరిగిందని అన్నారు. ఈ హౌస్ టు హౌస్ సర్వే ఈనెల 13వ తారీకు వరకు మండలంలోని 44 పోలింగ్ కేంద్రాల పరిధిలోని అందరూ ఇంటింటికి తిరిగి ఆధార్ లనివారికి ఆధార్ సేకరణ ఫోన్ నెంబర్ లేని వారికి ఫోన్ నెంబర్ సేకరణ పేర్లు తప్పొప్పులు లాంటివి ఆన్లైన్ ఆప్ నందు సరి చేస్తామని ఆయన అన్నారు ఆయన వెంట తహసిల్దార్ జయశ్రీ బి ఎల్ ఓ లు అక్బర్, విజయ, నర్మదా పాల్గొన్నారు.