ఏపీర పాల ఉత్పత్తి గణనీయంగా పెరిగడనికి మహిళలే కారణం: డిఏహెచ్ డి

– అనంతపూర్, చిత్తూరు జిల్లాల పాడి రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు మదర్ డెయిరీకి చెందిన శ్రీజ బాలాజీ డెయిరీ నిదర్శనంగా నిలుస్తున్నాయి
నవతెలంగాణ – తిరుపతి: భారత ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ (DAHD) అదనపు కార్యదర్శి వర్షా జోషి మాట్లాడుతూ.. ఆధునిక పాడి పద్ధతులను అవలంబించడం, పాడి పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందన్నారు. తిరుపతిలో నేడు 1.20 లక్షల మంది సభ్యులతో కూడిన ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా యాజమాన్యంలోని పాల ఉత్పత్తి సంస్థ శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ 10వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ రోజుకు 8 లక్షల లీటర్ల పాలను సేకరిస్తుంది. ఇటీవలి సంవత్సరాలలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతిని సాధించిందని, శ్రీజ వంటి సంస్థలు దీనిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని జోషి అన్నారు. పాల ఉత్పత్తిలో రాష్ట్రం ప్రస్తుతం దేశంలో 5వ స్థానంలో ఉందని, మొదటి 3లో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. పశుసంవర్థక శాఖ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తి 2014-15లో 96.56 లక్షల టన్నులు ఉండగా, 60% వృద్ధి తో 2022-23 నాటికి 1.54 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు.
        పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా-పాడి రైతులను ఉద్దేశించి నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్, NDDB డెయిరీ సర్వీసెస్ చైర్మన్ డాక్టర్ మీనేష్ షా ప్రసంగిస్తూ పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆ మార్గంలో అనేక మైలురాళ్లను సాధించినందుకు రైతులను అభినందించారు. పూర్వపు చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌లోని మిల్క్‌షెడ్ ప్రాంతంలో కార్యకలాపాలు శ్రీజ ప్రారంభించిందని, ఆ తర్వాత పొరుగు రాష్ట్రాలతో సహా పన్నెండు జిల్లాలకు విస్తరించిందని డాక్టర్ షా పేర్కొన్నారు. ప్రస్తుతం చిత్తూరు, అనంతపురం, తమిళనాడు & కర్ణాటక సరిహద్దులో ఉన్న పరిసర ప్రాంతాలలో శ్రీజ పాల ఉత్పత్తిదారులకు సేవలు అందిస్తోంది.