అదనపు ఎస్ఐ తానాజీ సేవలు మరువలేనివి

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండల అదనపు ఎస్ఐ తానాజీ చేసిన సేవలు మరువలేనివని బీజేపీ మంచిర్యాల జిల్లా నాయకుడు గోలిచందు అన్నారు. అదనపు ఎస్ఐ తానాజీ ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. దీంతో గురువారం జన్నారం పట్టణంలో తానాజీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల మౌనం పాటించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ  అదనపు ఎస్ఐగా తానాజీ జన్నారం మండల   ప్రజలతో మమేకమై పని చేశారన్నారు. తానాజీ చేసిన సేవలను మండల ప్రజలు గుర్తుపెట్టుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు హమాలీలు పాల్గొన్నారు.