నవతెలంగాణ -వలిగొండ రూరల్: కంచన పల్లి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పలువురు గురువారం బీఆర్‌ఎస్ లో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈరపాక నరేష్, ఈర పాక సురేష్, చిట్యాల అనిల్ చిట్యాల లెనిన్, చిట్యాల జనార్దన్, కుందారపు నరేష్ లు చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, డేగల పాండు యాదవ్, మొగుళ్ల శ్రీనివాస్, చిట్యాల మల్లేష్, శివ, రాజు, నరసింహా, లు పాల్గొన్నారు.