గల్ఫ్ కార్మికుల సమస్యలు తీర్చడం అభినందనీయం

Addressing the problems of Gulf workers is commendableనవతెలంగాణ – ఆర్మూర్
గల్ఫ్ కార్మికుల సమస్యలు అక్కడ చనిపోయిన వారి డెడ్ బాడీలను తెప్పిస్తూ సమస్యలు తీర్చడం అభినందనీయమని ఎన్నారై బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బట్టు స్వామి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  డొంకేశ్వర్ మండల్ నుతుపల్లి గ్రామానికి చెందిన సాయన్న ను ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటపాటి నరసింహ నాయుడు ఐదు రోజుల్లో భారత్ కు రాపించడం జరిగింది ఇలా ఎన్నో డెడ్ బాడీలను తెప్పించాడు అంతేకాకుండా గల్ఫ్ లో ఎవరికీ ఏ బాధ వచ్చిన నేనున్నా అంటూ ముందు నిలబడే మంచి వ్యక్తి అని అన్నారు ..ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఆర్ ఐ బీసీ  సంక్షేమ జక్రాన్ పల్లి మండల అధ్యక్షుడు జగడం రవి ,గగ్గుపల్లి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.