అడ్డీ మార్‌ గుడ్డి దెబ్బ…

అడ్డీ మార్‌ గుడ్డి దెబ్బ...కొన్ని పనులు చేసుకుంటా పోతనే ఉండాలె. అయితే అయితయి, కాకుంటే కావు. ‘గుట్టకు ఎంటిక కట్టినట్టు’, వస్తే గుట్ట రాకుంటే ఎంటిక పోయినట్టు. నచ్చినట్టు అనుకోని లేదా అనుకోకుండా చేసుకుంటూ పోవడమే పని. ఒక్కోసారి సక్సెస్‌ అయితది. దానినే ‘అడ్డీ మార్‌ గుడ్డి దెబ్బ’ అంటరు. అంటే అనుకోకుండా చేస్తే అద్భుతంగా అయితది. అంతేగాని వ్యూహాత్మకంగా విజయవంతం కోసం చేసిన పని కాదని అర్థం. దీనినే ‘నలుగురితో పాటు నారాయణ’ అని కూడా అంటారు. ఇది ఎట్లుంటది అంటే ‘చీకటి ఇంట్ల సిగం ఊగినట్లు’. చీకట్లో శిగం ఊగితే దేవుడు వచ్చింది రాంది ఎవరు చూస్తరు.
అట్లాగే ‘ఎంతటి చెట్లకు అంతే గాలి’ అన్నట్లు ‘చేసుకున్నోళ్ళకు చేసుకున్నంత’ అనే సామెత కూడా ఉంది. ‘ఎవరి జీవితాలకైనా చీకటి కొన్నాళ్లు వెలుగులు కొన్నాళ్లు’ అనే సామెత అలవోకగా వినబడుతుంది. సామెతలు తాత్వికంగానూ, చమత్కారంగాను ఉంటాయి.
కొన్ని హాస్యస్పోరకంగానూ ఉంటాయి. ఆడపిల్లనే కచ్చితంగా పుడుతుంది. తప్పితే మాత్రం మగ పిల్లవాడు అన్నట్టు ఉంటది. పుట్టేది ఆడ తప్పితే మొగనే కదా! ఆడపిల్ల అని మాత్రం గట్టిగా నొక్కి చెప్పి, తప్పితే ఎట్లా అని ఆప్షన్‌ కూడా తీసుకుంటారు. ఆడపిల్లనే పుట్టిందనుకో అదే అడ్డి మార్‌ గుడ్డి దెబ్బ విజయం..
– అన్నవరం దేవేందర్‌, 9440763479