
మండలంలోని నారం వారి గూడెం సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు బుధవారం తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నట్లు ఏడీఈ బి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. 33/11 కేవీ నారంవారిగూడెం సబ్ స్టేషన్ లో ఉన్న 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 8 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ను అమర్ఛుతున్నందున మంగళవారం ఉదయం 9 గంటలు నుండి మధ్యాహ్నం 3 గంటలు వరకు నారంవారిగూడెం సబ్ స్టేషన్ పరిధి లో గల గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని,కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.