నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి గాంచిన అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవాలయ నికి రూ.1లక్ష 65 వేలు ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వాహక అధికారి రమేష్ తెలిపారు. శుక్రవారం నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవి కిసాన్ పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు టెంటు సామను, వంట పాత్రలు కిరాయికి ఇచ్చుకొనుటకు హక్కు బహిరంగ వేలం నిర్వహించగా ఎస్ శ్రవణ్ కుమార్ హెచ్చు పాట పాడి వేలలో ఒక సంవత్సరం లీజు హక్కును దక్కించుకున్నారు. కార్యక్రమంలో వ్యాపారులు, ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్,జూనియర్ అసిస్టెంట్ సోని, రికార్డు అసిస్టెంట్ బుచ్చన్న, సిబ్బంది, అడెల్లి గ్రామస్థులు పాలోన్నారు.