ఎంపీపీ గెజ్జల సాయిలు జడ్పిటిసి లక్ష్మీ లింగం
నవతెలంగాణ – మిరుదొడ్డి
విద్యార్థులకు ప్రతిరోజు సరిపడా ఆహారాన్ని అందించాలని ఎంపీపీ గెజ్జల సాయిలు జెడ్పీటీసీ లక్ష్మీ లింగం అన్నారు. సోమవారం మిరుదొడ్డి మండలం అల్వాల చెప్పాలా ఎక్స్ రోడ్ వద్ద ఉన్న సాంఘిక బాలుర గురుకుల పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు మూడు పూటలా భోజనాన్ని అందించి వారికి కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత మనపై ఉందని అన్నారు. హాస్టల్లోనే సిబ్బంది తప్పనిసరిగా విద్యార్థుల సరియైన సౌకర్యాలు కల్పిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. హాస్టల్లో పారిశుద్ధంతోపాటు భోజనము మరియు పరిసరాల పరిశుభ్రత ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. విద్యార్థుల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వాయించడం మూలంగా విద్యార్థులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని తెలిపారు విద్యార్థులకు కూరగాయలు తప్పనిసరిగా రోజురోజుకు వారి గానే తీసుకురావాలని అన్నారు.