సీజనల్ వ్యాధులకు సరిపడ మందులు అందుబాటులో ఉంచాలి..

– పివైఎల్ ఆధ్వర్యంలో ధర్నా, వినతి పత్రం అందజేత..
నవతెలంగాణ -డిచ్ పల్లి
ప్రగతిశిలా యువజన సంఘం పివైఎల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిచ్ పల్లి  సెంటర్ లలో సీజనల్ వ్యాధులకు మందులు అందుబాటులో ఉంచాలని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారికి ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ మాట్లాడుతు వర్షాలు పడి, నీరు కలుషితం అవుతుందని, దాని వలన ప్రజలకు సిజినల్ వ్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అవగాహనా సదస్సులు నిర్వహించాలని, అలాగే వ్యాధులకు సరిపడ మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు .ప్రతి ఇంటికి తిరిగి వారి యొక్క స్థితి గతులను తెలుసుకోవాలని సాయినాథ్ అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా సహాయ కార్యదర్శులు బండమిది నర్సయ్య,భాస్కర్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.