– గ్రామసభల్లో అధికారులను ప్రశ్నించిన లబ్ధిదారులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజా పాలన దరఖాస్తులు కు,సామాజిక ఆర్ధిక సర్వేకి గ్రామ సభల్లో చదువుతున్న అర్హుల జాబితా కి పొంతనే లేదని పలు గ్రామ సభల్లో లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుండి అమలు చేయనున్న నాలుగు పధకాల లబ్ధిదారుల ఎంపిక పై నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభలు గురువారం మండలంలోని బచ్చువారిగూడెం,కొన్నాయి గూడెం,కావడి గుండ్ల,కొత్త మామిళ్ళ వారి గూడెం,నారాయణపురం,వినాయక పురం,పేరాయిగూడెం లలో గ్రామ సభలు నిర్వహించారు. నారాయణపురం,పేరాయిగూడెం గ్రామ సభల్లో పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు ఇందిరమ్మ ఇండ్లు విషయంలో తీవ్ర ఆందోళనకు గురై అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,మండల ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రదీప్ కుమార్,ఎం.పీ.డీ.ఓ ప్రవీణ్ కుమార్,ఎం.పీ.ఈ.ఓ సోయం ప్రసాద్ రావు,పీఆర్ ఏఈ అక్షిత,కార్యదర్శులు బంగారు సందీప్,రామక్రిష్ణ,సబిత,రమేష్ లు పాల్గొన్నారు.