ఆపదలో  ‘ఆది’ ఆపన్న హస్తం

'Adi' is the stopping hand in danger– కంపెనీ అధికారులకు లేఖ రాసిన ప్రభుత్వ విప్
– మహేష్ తిరుగు ప్రయాణానికి తగిన ఏర్పాటు చేస్తున్నామని వెల్లడి
నవతెలంగాణ – సిరిసిల్ల
ఆయన పేదల మనిషి …ఎవరికైనా ఆపద వచ్చింది అంటే తానే  ముందుండి సమస్య పరిష్కారం అయ్యేవరకు ఫాలో అప్  చేస్తుంటాడు ఆయనే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రస్తుత పరిస్థితుల్లో సర్పంచ్ గా గెలిస్తేనే ఊరు విడిచి పట్టణానికి వెళ్లి ఉంటున్న ఈ కాలంలో ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలవడంతోపాటు ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ తనను గెలిపించిన నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పిష్కరిస్తూ ప్రతి ఒక్కరు మెచ్చే నాయకుడిగా ముందుకు సాగుతున్నాడు అది శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముష్టిపల్లి గ్రామానికి చెందిన చీమల సంతోషి వ్యవసాయ పనులను ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యే క్రమంలో  ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందగా.. సంతోషి భర్త చీమల మహేష్ నెల రోజుల క్రితం బ్రతుకుదేరువు నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లి దమంలోని నెస్మా & పార్టనర్ కంపెనీ లో పని చేస్తున్నాడు.. సంతోషి మృతి చెందడంతో చీమల మహేష్ ను భారతదేశానికి త్వరగా తీసుకురావాల్సిందిగా మహేష్ బంధువులు ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ని సంప్రదించగా,తక్షణమే ఆయన స్పందించారు. వెంటనే  చీమల మహేష్ ను త్వరగా స్వదేశానికి పంపించాల్సిందిగా కోరుతూ సౌదీ అరేబియా దమంలోని నెస్మా & పార్టనర్ కంపెనీకి లేఖ  రాసి అధికారులతో మాట్లాడారు. కంపెనీ ప్రతినిధులు స్పందించి చీమల మహేష్ భార్య మృతికి సంతాపం తెలియజేస్తూ అతన్ని భారతదేశానికి పంపించడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని,  స్వదేశానికి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.. కాగా ఆపదలో ఉన్నామని ఆది శ్రీనివాస్ కు తెలపగానే తక్షణమే స్పందించడం పట్ల పలువురు హర్షం చేస్తున్నారు.