నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి కృషి: ఆది శ్రీనివాస్

– కాంగ్రెస్ పార్టీ లో  చేరిన వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామల ఉమా-లక్ష్మీరాజం..
– కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతుంది..  సోమవారం వేములవాడ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, వేములవాడ పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా లక్ష్మీరాజం దంపతులు కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో చేరడం జరిగింది.. వీరికి ప్రభుత్వం విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. పట్టణ సెస్ డైరెక్టర్ నామాల ఉమా- లక్ష్మీరాజం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం ఆరు గ్యారెంటీలు,అమలు చేస్తుందని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలో నుండి పలువురు చేరడం జరుగుతుందన్నారు.వేములవాడ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సామాజిక సేవకులకు,మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నానని కాంగ్రెస్ పార్టీ ద్వారా పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత చేరువ కావాలని కోరుతున్నాం అన్నారు. గత పది సంవత్సరాల బిఆరెస్ పాలనలో పేద ప్రజలకు సరైన న్యాయం జరగలేదన్నారు.కేవలం ప్రకటనలకు పరిమితమైందని రంగురంగుల బ్రోచర్లలో అభివృద్ధి తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా జరగలేదన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 వందల యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్ ఇస్తున్నామని ఆర్టీసీ బస్ లో జీరో టికెట్ మాదిరిగా, జీరో కరెంటు బిల్లు ఇస్తున్నామని,గతంలో  500రూపాయలు ఉన్న సిలిండర్ ధరకే,నేడు కాంగ్రేస్ ప్రభుత్వంలో అదే ధరకు ప్రజలకు అందిస్తున్న ఘనత కాంగ్రేస్ ప్రభుత్వానిదన్నారు. 20 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విటిడిఏ సమావేశం ఏర్పాటు చేసి నిధులను తిరిగి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.వేములవాడ పట్టణాన్ని,దేవస్థానాన్ని రెండింటిని సమాంతరంగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని, అందుకు తగిన ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు.గుడి చెరువులో మురుగునీరు కలవకుండా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీపాద ప్రాజెక్టుకి 1730 కోట్లు నిధులు కేటాయించిన గత పది సంవత్సరాలలో ఎలాంటి ముందడుగు జరగలేదన్నారు. నియోజకవర్గ పరిధిలో సాగునీటి రంగంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా శ్రీపాద ప్రాజెక్టును మొదటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, సాక్షాత్తు అసెంబ్లీ బడ్జెట్ పుస్తకంలో పెట్టినట్లు గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగ్ మహేష్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, పుల్కం రాజు, తూమ్ మధు, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, పాత సత్యలక్ష్మి , ముప్పడి శ్రీధర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.