వేములవాడ అర్బన్ మండలం చిర్లవంచ గ్రామంలో మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా గురువారం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాంధీ విగ్రహనికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ .. మహాత్మా గాంధీ వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు.మహాత్మా గాంధీ ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్దాం,అనాడు బ్రిటిష్ పాలనలో వివక్షకు,వారి అరాచక పాలనకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు అని అన్నారు. అనేక మంది స్వాతంత్ర సమరయోధులను ఏకం చేసి స్వతంత్ర పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారు అని తెలిపారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.గతంలో పెండింగ్లో ఉన్న 3000 పై చీలుకు దరఖాస్తులకు శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రజలు విడివిగా ఉత్తరాలు రాస్తే మళ్లీ ఎందుకు రాయడం అని దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు అని మండిపడ్డారు.ప్రజలు గ్రామపంచాయతీలో కూర్చొని నాకు వారి సమస్యలను పరిష్కరించవలసిందిగా ఉత్తరాలు రాస్తే దానిని కూడా కొందరు తప్పుగా చిత్రీకరించారు. ముంపు గ్రామాల ప్రజలను పది సంవత్సరాలుగా పట్టించుకోని వారు వారి పత్రికల్లో మమ్మల్ని విమర్శించే కార్యక్రమం చేపట్టారు అని చెప్పారు.వాళ్ళ ఇంటి పత్రికలో సమాధానం చెప్పాలని పెద్ద పెద్దగా రాస్తే దానికి సూటిగా సమాధానం చెప్పాను. అర్బన్ మండల పరిధిలో పలు సిసి రోడ్ల నిర్మాణానికి ఇంచుమించు రెండు కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.చీర్లవంచ గ్రామంలో మంచినీటి ఇబ్బంది ఉంటే బోర్లు వేపియడం, తెట్టకుంట గ్రామంలో సి సి రోడ్డు నిర్మాణం చేపట్టడం,దశాబ్ద కాలంగా వెనుకబడిన వేములవాడను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న అని తెలిపారు.
మారుపాక కామన్ నుండి సుద్దాల పళ్లీమక్త మర్తన్నపేట రోడ్డు గత పాలకులు పట్టించుకోక పోతే 1 కోటి 50 లక్షలతో రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయడం జరిగింది అని అన్నారు.మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణానికి 10 సంవత్సరాలుగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తే గత పాలకులు చేయకపోవడంతో ఏడు కోట్ల నిధులు కేటాయించడం జరిగింది,మోత్కరావుపేట చందుర్తి రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు తేవడం జరిగింది అని వెల్లడించారు.వేములవాడ పట్టణంలో అద్దాంతరంగా ఆగిపోయిన బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం జరుగుతుంది,ముంపు గ్రామాల ప్రజలకు 238 కోట్లతో 4696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో పాటు తదితరులు పాల్గొన్నారు.