నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ రూరల్ మండలం వట్టెముల గ్రామంలో వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వారి ఆధ్వర్యంలో రూ.23 లక్షలతో నిర్మిస్తున్న నూతన గోదాం నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో శనివారం టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు తో కలసి భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతును రాజుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యందిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది అని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సహకార సంఘాల ప్రాముఖ్యతను పెంపొందించారు.సహకార సంఘాలు బలోపేతం అయ్యే దిశగా వారు కృషి చేశారు అని అన్నారు. ప్రస్తుతం వాణిజ్య బ్యాంకులకు దీటుగా సహకార బ్యాంకులు ఎదిగాయి,వాణిజ్య బ్యాంక్ లతో పోటీపడి సహకార బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయి అని అన్నారు.రైతులకు ఉపయోగపడేలా ప్రతి గ్రామంలో గోదాంల నిర్మాణం చేసుకుందాం..దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కొనియాడారు.శుక్రవారం రోజున 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసాం..అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ పొందారని తెలిపారు.
రేషన్ కార్డ్ కేవలం కుటుంబ నిర్దారణ మాత్రమే..అదే ప్రామాణికం కాదు..పలు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసాం అని వెల్లడించారు.రుణమాఫీ కానీ రైతులు గ్రీవెన్ సెల్ అధికారులును సంప్రదించాలి,రైతులు పండించిన పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం అని హామీ ఇచ్చారు. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది..గతంలో వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రూ.10,000 నష్టపరిహారం అందించాంఅని తెలిపారు.రైతు భరోసా పై విధివిధానాలు ఖరారు అవుతున్నాయి,గతంలో అనర్హులకు రైతు బంధు ఇచ్చారు..రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చాం నిజమైన రైతలకు అందిస్తాం.వేములవాడ నియోజకవర్గనికి సంబంధించి 95 వేల ఎకరాలకు సాగు నీరు అందించే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును 1731 నిధులతో ఆనాడు మాల్యాల గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేసుకున్నాంఅని అన్నారు.అప్పుడే ఫాజల్ నగర్ రిజర్వాను ,ప్రధాన కాలువల నిర్మాణం పూర్తి చేసుకున్నాం..ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టకు నీరందించే ప్రాజెక్టుల్లో అసెంబ్లీ పుస్తకాల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ను చేర్చడం జరిగిందిఅని ప్రజలకు తెలిపారు.రైతుకు సంబంధించిన ఏ ఇబ్బందినైనా అధిగమిస్తూ ప్రజాప్రభుత్వం ముందుకు పోతుంది అని వెల్లడించారు ఈ కార్యక్రమంలో,పాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్, రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు.