కార్ గ్యారేజికి పోయింది: ఆది శ్రీనివాస్..

– రైతు వ్యతిరేక బీజేపీకి తగిన గుణపాఠం చెపుదాం..
– కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, బీజేపీ ది కార్పొరేట్ ప్రభుత్వం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు మాత్రమే బాగుపడ్డారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పని అయిపొయింది, కార్ గ్యారేజి కి పోయింది పది సంవత్సరాల్లో కెసిఆర్ కు ప్రజలు గుర్తుకు రాలేదు.. అని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. గురువారం వేములవాడ రూరల్  మండలం తుర్కాసినగర్, ఫాజుల్ నగర్,వట్టెముల, నమిలిగుండు పల్లి, నూకలమర్రి,గ్రామాల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావు మద్దతుగా ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..మే 13 న  పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ప్రజలను కోరారు.నాలుగున్నర మాసాల క్రితం బీఆర్ఏస్ పార్టి నీ పక్కన పెట్టినట్లుగా బిజేపి నీ కూడా పక్కన పెట్టాలి అని అన్నారు.గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో బిసి బంధు బిఆర్ఎస్ బందు అయ్యింది అని హెద్దేవా చేశారు.
దళిత బందు ఇవ్వలె, ఇంటికో ఉద్యోగం అని ఇవ్వలేదు..ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు..రైతులకు ఋణ మాఫీ చేస్తామని మోసం చేశారు.కెసిఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అప్పుల కుప్పగా మార్చిన మీ ఆశీస్సులతో అధికారంలోకి రాగానే మహిళా లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాం అని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల వరకు పెంచుకున్నం,గతంలో రైతులకు ఉచిత కరెంటు  ఇచ్చామని తెలిపారు. నేడు గృహాలకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నం,500 రూపాయలకే  సిలిండర్ ఇస్తున్నాం ని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో 3500 ఇండ్లు మంజూరి అయ్యాయి..ఆగస్ట్ 15 లోపు రైతులకు 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి తీరుతామని అన్నారు. రైతులకు రైతు భరోసా ఇస్తుంటే బిజేపీ,బీఆర్ఎస్ రెండు కలసి ఎలక్షన్ కమిషన్ కు పిర్యాదు చేసి రైతు భరోసా ఆ పేరు అని విమర్శించారు.బిజేపీ,బీఆర్ఎస్ రెండు ఒకే గూటి పక్షులు,గతంలో 2018 ఎన్నికల్లో ఎలక్షన్ రొజు ఓటర్లు లైన్ లో నిలుచొని ఓటు వేస్తున్న సమయంలొ టింగ్ టింగ్ మని రైతు బందు వేస్తే బిజేపీ ఎందుకు పిర్యాదు చేయలేదు కానీ ప్రశ్నించారు.కెసిఆర్ వేములవాడ రాజన్న కు ఏటా 100 కోట్లు ఇస్తానని మోసం చేశాడు.మొన్న మోడి వస్తె మా రాజన్న కు ఏం అన్నా ఇస్తాడు అనుకున్న, ఉత్తర కాశీ లో పోటీ చేసి గెలిచిన మోడి దక్షణ కాశీ వేములవాడ రాజన్న సన్నిధికి వస్తె గుడి అభివృద్ది కోసం నిధులు ఇస్తాడు అనుకుంటే ఉట్టి చేతులతో వెళ్లిపోయాడని ఆగ్రహించారు.మన రాజన్న కీ ఎం ఎవ్వని మోడి మన ప్రజలకు ఏం ఇస్తాడు..కేంద్రంలో ప్రసాద్ పథకం ద్వారా అయిన ఇవ్వనీ బిజేపీ వారికీ ఓటు ద్వారా బుద్ధి చెబుదాం అని అన్నారు. రిజర్వేషన్లు, రాజ్యాంగం ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  రావాలని కోరారు.కాంగ్రెస్ పేదల ప్రభుత్వం, బిజేపీ ది కార్పొరేట ప్రభుత్వం..మోడి పది సంవత్సరాల క్రితం నల్ల ధనం తెచ్చి పేదవారి ఖాతాల్లో నల్లధనం వేస్తా అన్నాడు..కని రైతాలకు నల్లా చట్టాలు తెచ్చారు.జన్ దన్ ఖాతాల్లో నల్లధనం 15 లక్షల ఇస్తానని మోసం చేశారని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకం పని దినాలను పెంచుతూ, కూలి 400 వరకు పెంచుతాం అని తెలిపారు.అధికారం ఉన్నప్పుడు ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కి పరిమితమై నేడు అధికారం పోగానే బస్సు యాత్ర పేరుతో వస్తున్నాడు నమ్మకండి అని అన్నారు. సోనియా గాందీ మిగులు బడ్జెట్ గా ఉన్నా రాష్ట్రన్ని ఇస్తే కెసిఆర్ రాష్ట్రన్నీ అప్పుల కుప్పగా మార్చారు అని మండిపడ్డారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి ముంబై వరకు సుమారు పదివేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉన్న పలు సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి వస్తున్న రాహుల్ గాంధీకి అండగా ఉండాలన్నారు. వెలిచాల రాజేందర్ రావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.