– రాజకీయ నాయకుల అండదండలతో తిష్ట వేసుకొని కూర్చున్న అధికారులు
– ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చినా వెళ్ళకుండా పోస్ట్ మార్చుకొని కూర్చుంటూన్న అధికారులు
– 6 ఏండ్లుగా కమిషనర్ మాత్రమే బదిలీ తప్ప కింది స్థాయి ఉద్యోగులు మారడం లేదు
– మూడు మున్సిపాలిటీ ఆఫీసులకు
– ఒక్కరే టౌన్ ప్లానింగ్ అధికారి ఉండటంతో పెండింగ్‌లో ఉంటున్న పైల్స్
నవతెలంగాణ-ఆదిబట్ల
అధికారులకు కాసులు కురిపిస్తున్న ఆదిబట్ల మున్సి పాలిటీ, చోద్యం చూస్తున్నపై అధికారులు, ఆదిబట్ల మున్సి పల్ పరిధిలోని ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంలో కొన్నేం డ్లుగా కమిషనర్స్ బదిలీ అయ్యారు కానీ కింది స్థాయి ఉద్యో గులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, మానేజర్స్ ఏఈలు మాత్రం మారడం లేదు. ఒకవేళ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చిన గుట్టు చప్పుడు కాకుండా రాజకీయ నాయకుల అండదం డలతో అక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధి కారులకు కాసులు కురిపిస్తున్న ఆదిబట్ల మున్సిపాలి టీ…ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ వచ్చిన లేదా వారి స్థానంలో వేరే అధి కారి వచ్చిన వీళ్ళు మాత్రం బయటికి వెళ్లకుండా అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అప్లికే షన్, ముటేషన్, అసెస్స్‌స్మెంట్, చేయాలన్న వీరి కనుసన్న లోనే జరుగుతుంది. వీరిని కాదు అంటే నెలల తరబడి రోజు కాళ్ళు అరిగేలా ప్రజలు కార్యాలయం చుట్టూ తిరగలి సిందే. ఒక పనికి నిర్ణిత కాలవ్యవధి లేకపోవడంతో కాసు లు అందేవరకు ప్రజల ఫైల్ పెండింగ్‌లో ఉంచుతు న్నారు. పలానా పనికి ఇంత అని ఫోన్‌లో సెటిల్మెంట్ మా ట్లాడుకొని పని చేసి పెడుతున్నారు. ఒక ఇంటికి పర్మిషన్ కావాలంటే నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. 3,4 మున్సిపా లిటీలకు ఒకరే టౌన్ ప్లానింగ్ అధికారి ఉండ టంతో వారానికి ఒకసారి అందుబా టులో ఉండటంతో చాలా ఫైల్స్ పెండింగ్ లో ఉంటున్నాయి. త్వరగా ఇంటి పర్మిషన్ వస్తే ఇల్లు కట్టుకుందామనుకునే వారికి నెల లు తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. సం బంధిత అధికారి ఆఫీస్‌లో ఉండరు. ఫోన్ లో మాత్రంమే బేరాలు ఆడుతూ కాలయా పన చేస్తూ ఇంటి పర్మిషన్ ఇవ్వడానికి సాకు లు చెబుతూ వచ్చినంత కాసులు దండుకుం టున్నారు. కొన్నేండ్ల నుండి ఆదిబట్ల మున్సి పల్ కార్యాలయంలో కమిషనర్ ఒక్కరే బదిలీ అయ్యారు. మిగతా కిందిస్థాయి ఉద్యో గులు రాజకీయ అండదండలతో చాకచక్యంగా గుట్టు చప్పు డు కాకుండా కాసులు దండుకుంటూ మేనేజర్, పోస్ట్ కాక పోతే, ఆర్‌ఓ, లేదంటే, అసిస్టెంట్ ఇలా పోస్టులు మారు తూ అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటున్నారు.