
నవతెలంగాణ-ధర్మసాగర్
ధర్మసాగర్ మండల కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా ధర్మసాగర్ గ్రామానికి చెందిన అడిగొప్పుల ప్రవీణ్ విజయం సాధించారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఎన్నికలు ఆగస్ట్ నెలలో జరగగా అతనికి 733 ఓట్లు వచ్చియని తెలిపారు. మండలంలోని దేవునూర్ గ్రామానికి చెందిన కొనగంటి రంజిత్ కు 493 ఓట్లు వచ్చినందున అతనిని మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమీషన్ వారు ప్రకటించారు. అనంతరం తడి గొప్పల ప్రవీణ్ మాట్లాడుతూ నా గెలుపుకు సహకరించిన నాయకులకు సహచర మిత్రులకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారికి, వరంగల్ ఎంపీ కడియం కావ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను అని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.