
ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కెప్టెన్ జగ్రామ్ అంతర్వేది డాక్టరేట్ పట్టా అందుకున్నారు. రసాయన శాస్త్రంలో, “స్పెక్ట్రోస్కోపిక్ స్ట్రక్చరల్ ఎలక్ట్రికల్ ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ బేరియం ఆక్సైడ్ కంటైనింగ్ జింక్ బోరేట్ గ్లాస్ సిస్టం డోపుడు విత్ ఆల్కలీ ఆక్సైడ్స్” అనే అంశంపై ప్రొఫెసర్ టి. గంగాధర్ మార్గదర్శకత్వంలో చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకోనున్నారు. ఈ పరిశోధన వల్ల భవిష్యత్తులో పర్యావరణహిత గ్లాస్ పాలిమర్లను రూపొందించే అవకాశం కలుగుతుంది. డాక్టరేట్ పట్టా పొందిన జగ్రామ్ అంతర్వేదిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. సంగీత అధ్యాపకులు అరుణ్ కుమార్, శ్రావణి, శ్రీధర, జోత్స్న మంజుల, సంతోష్ కుమార్, రమాకాంత్ గౌడ్, చక్రవర్తి, రవి కిరణ్ రాజ్ కుమార్, అష్రఫ్ అలీ, రాజేశ్వర్ తదితరులు ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.