– సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కార్మిక పోరాటాల సారథి ఐక్య ఉద్యమాల వారథి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సీఐటీయూ ఆదిలాబాద్ జిల్లా కార్యాలయం బాశెట్టి మాధవ రావు విజ్ఞాన కేంద్రం నవంబర్ 28న ప్రారంభించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తెలిపారు. జిల్లా కార్మిక వర్గం ఉద్యోగులు ప్రజానీకం రైతాంగం అధిక సంఖ్యలో ప్రారంభ సభకు హాజరవ్వాలని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవనంలో ఏర్పాటుచేసిన సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నవంబర్ 28న జిల్లా కేంద్రంలోని సీఐటీయూ జిల్లా కార్యాలయం బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రాన్ని మాజీ పార్లమెంటు సభ్యులు, అనేక పోరాటాలకు నాయకత్వం వహించిన కామ్రేడ్ బృందా కరత్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు తెలిపారు. అతిథులుగా సీఐటీయూ అఖిలభారత కోశాధికారి ఎం.సాయిబాబు ఆదివాసి హక్కుల చట్టం రూపకర్త మాజీ పార్లమెంటు సభ్యులు మీడియం బాబురావు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.జయలక్ష్మి కూరపాటి రమేష్ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ హాజరవుతారని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు, కార్మిక కర్షక హక్కుల సాధనకై పోరాటాలను నిర్మించేందుకు, భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పనకు బాసెట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రం వేదిక కానుందని అన్నారు. జిల్లాలోని కార్మిక వర్గం కార్మిక ఉద్యమ శ్రేయోభిలాషులు అక్కున చేర్చుకుని నిర్మాణానికి సహకరించారని అన్నారు.కామ్రేడ్ బాశెట్టి మాధవ రావు చివరి వరకు కష్టజీవుల పక్షాన నిలబడి పోరాడారు. జిల్లాలో సీఐటీయూ ని ప్రారంభించి సంఘాలు పెట్టి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. ఆయన స్ఫూర్తికి గుర్తుగా ఆశయ సాధనకై పోరాటాలకు వేదికగా కార్యాలయం ఉంటుందని ప్రారంభోత్సవ సభకు జిల్లా కార్మిక వర్గం ప్రజానీకం అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొజ్జ ఆశన్న, అన్నమొల్ల కిరణ్, కోశాధికారి కే.సునీత, ఉపాధ్యక్షులు దర్శనాల మల్లేష్, గంగన్న, అగ్గిమల్ల స్వామి, సహాయ కార్యదర్శులు డి.వెంకటమ్మ, ఎస్ నవీవ్ కుమార్, జితేందర్ నాయకులు పొచ్చన్న, జితేందర్, సునీత, ముక్త రమేష్, శ్రీనివాస్, స్వామి పాల్గొన్నారు.