ఆరోగ్య పాఠశాల కార్యక్రమంపై ఆదిలాబాద్ కలెక్టర్ రివ్యూ..

Adilabad Collector Review on Health School Programme..నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా మూడవ రివ్యూ సమావేశాన్ని శనివారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో చేపడుతున్న కార్యక్రమాల వివరాలు వాటి వల్ల కలిగిన ప్రయోజనాలు 43 పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థులు స్టూడెంట్ ఛాంపియన్స్ కలెక్టర్ రాజర్షి షా తో నేరుగా పంచుకున్నారు. ముఖ్యంగా పాఠశాలల్లో చదువుతున్న పెద్ద పిల్లలు ఎవరికైతే గుట్కా తంబాకు సిగరెట్ తాగడం వంటి చెడు వ్యసనాలను మానెషం అని తెలియజేశారు. అంతేకాకుండా తల్లిదండ్రులలో కూడా ఇలాంటి మార్పు పిల్లలు కోరుతున్నామని తెలిపారు. మోడల్ స్కూల్ గుడిహత్నూర్ కు చెందిన స్టూడెంట్ ఛాంపియన్  2025 ముగిసేకల్లా తండ్రితో చెడు వ్యసనాలు పూర్తిగా మానేస్తానని తెలియజేశారు. అలాగే జెడ్పిహెచ్ఎస్ సిరిసన్న పాఠశాలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలను వినూత్నంగా ఆటల ద్వారా కొనసాగిస్తున్నామని వైకుంఠపాళిలో ఆరోగ్య పాఠశాల సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందుపరిచి తద్వారా పిల్లలతో ఆటలాడించి కార్యక్రమ అంశాలను అవగాహన కల్పిస్తున్నారు. జడ్పిహెచ్ఎస్ తోశం పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానం నుంచి ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలతో సహా పాఠ్యాంశాలను కూడా బోధిస్తున్నామని తద్వారా సమయాన్ని తగ్గించడమే కాకుండా పిల్లలు ఆసక్తికరంగా నేర్చుకుంటున్నారని పాఠశాల హెచ్ఎం గోపాల్ సింగ్ తిలావత్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సంతోష్ పేర్కొన్నారు. అనంతరం స్టూడెంట్ చాంపియన్ విద్యార్ధులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ ప్రణీత, ఆరోగ్య పాఠశాల అనుసంధానకర్త అజయ్ పాల్గొన్నారు.