ఆడియో పాట సీడీని ఆవిష్కరించిన ఆదిలాబాద్ కలెక్టర్

Adilabad collector unveils audio song CDనవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజాపాలన విజయోత్సవాలు సందర్భంగా ఆదివారం జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సారథి కళాకారుల చే రూపొందించిన ప్రజాపాలన ఆడియో పాటను కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు.  రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రం లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో  జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సారథి కళాకారుల చే రూపొందించిన ప్రజాపాలన ఆడియో సాంగ్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 7 వరకు జిల్లాలోని మండలాల్లోని ఆయా గ్రామాల్లో, మున్సిపాలిటీలలో రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ లు మహాలక్ష్మి, ఇందిరా మహిళా శక్తి, గృహ జ్యోతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్లపై కళాకారుల ఆటపాటలతో అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ప్రతి మండలం నుంచి మూడు గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందనీ తెలిపారు. ఈ  కార్యక్రమంలో డీపీఆర్ఓ తిరుమల, జిల్లా అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.