పట్టణంలోని డైట్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నిర్వహించిన ఈ వేడుకల్లోవిద్యార్థులు ఉత్సాహంగాపాల్గొన్నారు. సీనియర్ లు జూనియర్ లకు స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు ఆలరించారు. సినిమా, జానపద పాటలపై నృత్యాలు చేస్తు హోరెత్తించారు. తోటి విద్యార్థులు కేరింతలు కోడుతూ వారిని మరింత ఉత్సహపరిచారు. కొత్త విద్యార్థులకు స్వాగతం పలుకుతూ సీనియర్లు చేసిన నృత్యాలు, ఇతర కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిరణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.