సీపీఐ(ఏం) రాష్ట్ర అత్యున్నత కమిటీలో జిల్లా ఆదివాసీ నేతకు చోటు దక్కింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 25 నుండి 28 వరకు సీపీఐ(ఎం) రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ రాష్ట్ర మహసభల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ 60 మందితో ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన ఆదివాసీ నేత పూసం సచిన్ ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నుకున్నారు. సీపీఐ(ఎం)లోని అత్యున్నత కమిటీ లో పూసం సచిన్ కు అవకాశం దక్కడం పట్ల సీపీఐ(ఎం) ఏరియా కమిటీ కార్యదర్శి లంకా రాఘవులు, సభ్యులు నెళ్ల స్వామి ఆశన్న, పార్టీ ఏరియా కమిటీ నుండి హర్షం వ్యక్తం చేస్తూ పూసం సచిన్ కు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.