కాంగ్రెస్ ఏడాది పాలన గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ఎలాంటి తేడా లేదని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. శనివారం ఎస్టీయూ భవనం వద్ద కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై చార్జ్ షిట్ ను విడుదల చేశారు. అనంతరం అక్కడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కాంగ్రెస్ వైఫల్యాలపై నినాదాలు చేస్తు సాగింది. అధికారంలోకి రాకముందుకు కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చిందని, ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ఎమ్మెల్యే పాయల శంకర్ ఆరోపించారు. రైతులకు రుణామాఫీ, రైతు బంధు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, పింఛన్ తదితర వాటిని గాలికి వదిలేసిందన్నారు. బీఆర్ఎస్ పదేండ్ల హాయంలో ఏడు లక్షల కోట్ల అప్పులుంటే కాంగ్రెస్ ఏడాది పాలతో లక్ష 20 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. పాలనలో కాకుండా కాంగ్రెస్ అప్పుల్లో పోటీ పడుతుందన్నారు. బీసీలకు బడ్జెట్ కేటాయిస్తామని ఎన్నికల ముందు సీఎం అనేక హామీలు ఇచ్చి మొండి చెయ్యి చూపించారని మండిపడ్డారు. ఎం సాధించారని విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మనంద్, నాయకులు ఆధినాథ్, ఎన్రాల నగేష్, ముకుంద్, దినేస్ మటోలియ, రఘుపతి, ధోని జ్యోతి, ఆకులప్రవీణ్ ఉన్నారు.