రక్త సేకరణలో ఆదిలాబాద్ రిమ్స్ బ్లడ్ బ్యాంక్ మొదటి స్థానంలో రావడం అభినందనీయమని డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ అన్నారు. మొదటి స్థానం పొందిన బ్లండ్ బ్యాంక్ సిబ్బందిని మంగళవారం ఆయన ఛాంబర్ లో సత్కరించారు. అవార్డుతో పాటు ప్రశంస పత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రిమ్స్ డైర్టెర్ జైసింగ్ రాథోడ్ మాట్లాడుతూ… దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో రిమ్స్ ని బ్లడ్ బ్యాంక్ కు రక్త సేకరణ అయిందన్నారు. దీని కారణంగా రాష్ట్ర స్థాయిలో 53 బ్లడ్ బ్యాంకుల్లో ఆదిలాబాద్ కు మొదటి స్థానం రావడం హర్షణీయమన్నారు. ఇదే స్పూర్తితో సిబ్బంది ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలో కూడా అవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అవసరమైన వారికి రక్తం అందిస్తు సేవలను మరింత విస్తృతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ సుధాకర్, ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్, నర్సింగ్ సూపరింటెండెంట్ రమదేవి, సినియర్ నర్సింగ్ ఆఫీసర్ సంధ్యరాణి, సునీల్ కుమార్, సతీష్ రెడ్డి, సులేమన్ ఉన్నారు.