ఆదిలాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో ముగ్గుల పోటీలు..

Competition of trios in Adilabad RTC bus stand..నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రయాణీకులకు మరింత చెరువయ్యేల ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని ఆర్టీసీ డీఎం కల్పన అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శనివారం ఆర్టీసీ బస్టాండ్ లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రయాణీకులతో పాటు మహిళ ఉద్యోగులు, వారి పిల్లలు ఉత్సహంగా పాల్గొన్నారు. రంగురంగు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను ఇచ్చారు. ఈ సందర్భంగా డీఎం కల్పన మాట్లాడుతూ… ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేయడంతో పాటు వారికి మరింత దగ్గర అయ్యేల వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. మహిళలు, ఉద్యోగులు, వారి పిల్లలు ఉత్సహంగా పాల్గొన్నారని తెలిపారు.