68వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జనవరి 29 నుండి 31 వరకు మెదక్ జిల్లా తూప్రాన్ లో నిర్వహించిన ఎస్ జి ఎఫ్ అండర్ 14 రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లు తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. తృతీయ స్థానం కోసం హోరాహోరీగా జరిగిన పోరులో బాలుర విభాగంలో కరీంనగర్ జట్టును ఓడించగా, అటు బాలికల జట్టు మెదక్ పై గెలుపొంది మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నట్లు కోచ్ మేనేజర్లు స్నేహ కుమారి, భవ్యత, నగేష్ రాజశేఖర్ లు తెలిపారని ఆదిలాబాద్ జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య నిర్వాహక కార్యదర్శి కాంతారావు పేర్కొన్నారు. జిల్లా బాల బాలికల జట్లు తృతీయ స్థానం కైవసం చేసుకోవడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి టి ప్రణీత, డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.