అర్జీలు స్వీకరించిన ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్

నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ప్రజావాణిలో వచ్చే అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కరం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విద్య, వైద్యం, వైద్యం, పంచాయతీ, పెన్షన్, ఉపాధి, పరిశ్రమల శాఖలకు సంబంధించి 63 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు దరాఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్ మాలవీయ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, డీఆర్డీఓ సాయన్న, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.