నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
ఆదిలాబాద్ మున్సిపల్ వైశాల్యంలో పెద్దదిగా ఉందని, భవిష్యత్తులో కార్పోరేషన్ అయ్యే అవకాశాలున్న నేపథ్యంలో సమస్యలతో పాటు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ముమ్మరంగా చేపడుతున్నామని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. పట్టణంలోని ద్వారాకనగర్ లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజచేశారు. 20 లక్షలతో సీసీ డ్రైనేజీల కోసం శంఖుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆకుల ప్రవీణ్, కాలనీ వాసులు దేవిదాస్ దేశ్పాండే, తాటిపెల్లి శివప్రసాద్, బండారి వామన్, అన్నదానం జగదీష్, అశోక్ పాల్గొన్నారు. అదే విధంగా వార్డు నంబర్ 47లోని పోలవార్ కాంప్లెక్స్ వద్ద 20 లక్షల రూపాయలతో బీటీ, సీసీ రోడ్డుతో పాటు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆకుల ప్రవీణ్, సోమ రవి, కాలనీ ప్రజలు గోర్ల సంతు, పోలవార్ సురేష్, పోతారాజు గంభీర్, వట్టం భూమయ్య, కొమ్మవార్ రాజేష్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే అటూ వార్డు నంబర్ 27లో 20 లక్షల రూపాయలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. నాణ్యత లోపించకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… పట్టణంలో 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే 16, 17 వార్డుల్లో పనులకు సంబంధించి భూమి పూజ చేశామన్నారు. ఇంకా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తి చేసేల కృషి చేస్తామన్నారు. పట్టణంలోని మురికి నీరు కాలువల ద్వారా సమీపంలోని చెరువుల్లో కలిసి నీరు కలుషితం అవుతున్నాయన్నారు. 320 కోట్లతో ఎన్టీపీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పట్టణాన్ని రాష్ట్రంలో ఆదర్శవంతంగా తయారు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల ప్రవీణ్, బీజేపీ సీనియర్ నాయకులు గందే విజయ్ కుమార్, గందే కృష్ణ కుమార్, జోగు రవి, ఆరె కటిక సంఘం అధ్యక్షుడు మురకర్ శ్రీనివాస్, శివాజీ, అంజనేయులు, గుండవార్ సంతోష్ పాల్గొన్నారు.