– సీపీఐ(ఎం) నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశంలోనే ఆదివాసీ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది అని,ఉనికి కోల్పోతున్న సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని శుక్రవారం తెలంగాణ గిరిజన సంఘం ఆద్వర్యంలో సంఘం నాయకులు మడకం నాగేశ్వరరావు అద్యక్షతన నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని నందిపాడు లో నిర్వహించారు. స్థానిక మాజీ సర్పంచ్,సీనియర్ నాయకులు ఊకే వీరాస్వామి ముందుగా పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం పుల్లయ్య మాట్లాడుతూ ప్రపంచీకరణ,ఎన్నో మతాల ఆధిపత్యం చొరబాటు నుండి, అత్యంత ప్రాచీనమైన అస్థిత్వం,సంస్కృతిని కాపాడుకుంటున్నారు అని హర్షం వ్యక్తం చేసారు. ఏజెన్సీ లో గిరిజన చట్టాలను పకడ్బంది గా అమలు చేయడమే ఈ దినోత్సవానికి సార్ధకత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ చిరంజీవి,మాజీ సర్పంచ్ బుల్లెమ్మ,కారం సూరిబాబు,జోగారావు,పెద్ద ప్రసాద్,సీతయ్య లు పాల్గొన్నారు.
సీపీఐ యం.ఎల్ – మాస్ లైన్ ప్రజాపంథా ఆద్వర్యంలో..
సీపీఐ యం.ఎల్ – మాస్ లైన్ ప్రజాపంథా మండల కమిటీ ఆద్వర్యంలో అశ్వారావుపేట కార్యాలయంలో పార్టీ మండల నాయకుడు బాడిశ లక్ష్మణ్ రావుఅధ్యక్షతన జరిగిన సదస్సులో పార్టీ పాల్వంచ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, మండల కార్యదర్శి వాసం బుచ్చి రాజు లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ మండల కార్యదర్శి కుంజా అర్జున్,పీఓడబ్ల్యూ మండల కార్యదర్శి కంగాల భూ లక్ష్మీ,మండల నాయకులు,కన్నాయిగూడెం మాజీ సర్పంచ్ గొంది లక్ష్మణ్ రావు,నాయకులు కంగాల వెంకటేష్,వాసం పోతురాజు, తెల్లం సత్యం,మడివి రవి, సోయం కామరాజు, నాయకురాలు గోకినపల్లి గంగ, కొమరం చిన్న లక్ష్మి,కబ్బాడి కవిత,కొమరం సింగమ్మ,వాసం దుర్గ,సోడెం మంగ ,మొడియం జానకి,జెడ్డి అజిత,కొమరం కన్నమ్మ,కంగాల కన్నయ్య, సోడెం లక్ష్ముడు,సన్యాసి దుర్గారావు,కాక బాబు,కారం వెంకటేష్,చక్రధర్ కంగాల సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల అభివృద్దే నా అజెండా – మాజీ ఎమ్మెల్యే మెచ్చా..
నియోజకవర్గ కేంద్రం అశ్వారావుపేట లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో గల కొమరం భీం విగ్రహం వద్ద పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గిరిజన మహిళా ఉద్యోగులు తో కలిసి ఆదివాసీ నృత్యం చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలు, సంఘాలు వేరైనా నా అజెండా మాత్రం ఆదివాసీల అభివృద్దే నని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో సత్యవరపు సంపూర్ణ,మందపాటి రాజమోహన్ రెడ్డి, నియోజకవర్గ,మండల స్థాయి ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.