
మండల కేంద్రంలోని తడగాం, దర్యాపూర్ మరియు మహంతం గ్రామాలలో ఆదివాసి నాయక్ పోడు సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి జెండాను ఎగరవేసి కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచుకొని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో పర్యావరణాన్ని రక్షిస్తూ జీవనం సాగిస్తున్న ఆదివాసీల రక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మేకల నర్సయ్య, సుంకరి రాజు, రవి, పోశెట్టి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.