ఆదివాసి పేదరికానికి సామాజిక ఆసరా…

Social support for tribal poverty...– సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చేయూత…
– డాక్టర్ కొనకళ్ల సుధారాణి ఆపన్న హస్తం…
– 20 కుటుంబాలకు ట్రస్ట్ తరఫున నిత్య అవసరాలు,పండ్లు వితరణ..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నడక వీలులేని దారి సైతం లేని అటవీ ప్రాంతంలో ఉన్న అశ్వారావుపేట మండలం సున్నం బట్టి పంచాయితీకి సుదూర అడవి మధ్యలో ఉన్న “పెద్ద మిద్దె” గిరిజన గ్రామ ఆదివాసీలు పోషకాహారం, పేదరికం వల్ల పోషకాహార లోపంతో బాధపడుతున్న ఆదివాసీలకు సుధా హెర్బల్ స్వచ్చంద సేవా సంస్థ ఆద్వర్యంలో నిర్వాహకురాలు ఈ సుధా కొనకళ్ళ ఆసరాగా నిలిచారు. ప్రజలు ఇబ్బంది పడటం,అనారోగ్యానికి గురి కావటం లాంటి విషయాలను తెలుసుకున్న ఆమె బుధవారం నేరుగా ఆదివాసీలు ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు.ఉదయం 5:30 కే వారి ప్రాంతానికి చేరుకుని అక్కడ నివాసం ఉంటున్న 20 కుటుంబాలకు నిత్యావసరాలు, పండ్లు వితరణగా అందించారు. ఆ తర్వాత వారితో మాట్లాడారు.సుధా హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తాను ఈ వితరణ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆమె వివరించారు. అనంతరం ఆదివాసీలకు ఆరోగ్య సూచనలు చేశారు.