మండలంలోని మేడారంలో అభ్యుదయ యువజన సంఘం అధ్యక్షులు సిద్ద బోయిన భోజరావు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల యువజన సంఘాల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి నికి మండలం లోని 25 గ్రామల అధ్యక్షులు, కార్యదర్శిలు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథి గా ఆదివాసీ విద్యార్థి సంఘo రాష్ట్రా నాయకులు కోర్నిబేల్లి గణేష్ హాజరై మాట్లాడారు. ఆదివాసీ యువత భారత రాజ్యాంగం, ఆదివాసీ హక్కులు చట్టల పై అవగహన కలిగి ఉండాలి అని మన గ్రామం లో సమస్యలు వస్తే పరిస్కారం కోసం ఉమ్మడి పోరాటం చేయాలని అన్నారు. ఈ సమావేశం లో విశిష్ట అతిధిగా సమ్మక్క సార్లమ్మా ఆదివాసీ మ్యూజియం అసిస్టెంట్ క్యూరేటర్ కుర్సం రవి మాట్లాడుతు.. ఆదివాసీ విద్యార్థులు విద్య నీర్లక్ష్యం చేయకూడదని, ప్రభుత్వం విద్య అవకాశలు అన్ని రకాల సేవలు అందిస్తున్నారని, ప్రతి ఆదివాసి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్య ద్వారా నే మన జాతి అభివృద్ధి అవుతుంది అని తెలిపారు. తుడుందెబ్బ మండలం అధ్యక్షులు మోకాళ్ళ వెంకటేష్, మాట్లాడుతూ మండలం లోని అన్ని గ్రామలలో “మా గూడెం లో, మా రాజ్యం” కోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలు, ఆచారం కట్టుబాట్లు పాటించాలన్నారు. ఈ సమావేశం లో బయక్కపేట, కల్వపల్లి, ఉరట్టం , కన్నెపల్లి, పాడిగపూర్, ఎలబాక, గోనెపల్లి కామరాం, తాడ్వాయి, నర్సాపూర్, భూపతిపూర్ మొదలగు గ్రామల యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.