– అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు
– ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నవతెలంగాణ-లక్షెట్టిపేట
కుమురంభీం భీమ్ ఆశయాలు సాధించడానికి అంబేద్కర్ యువజన సంఘం నిరంతరం కృషి చేస్తుందని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా పట్టణంలోని కరీంనగర్ చౌరస్తాలో గల కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసిన ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దొంత నర్సయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు బిరుదుల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, నాయకులు భైరం శ్రీనివాస, అడ్వకేట్ రాజేష్ పాల్గొన్నారు.
జన్నారం : ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివాసీ గిరిజన సంఘం తుడుం దెబ్బ నాయకులు ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు. అలాగే మండలంలోని తొర్రే గిరిజన గ్రామంలో ఆదివాసీ సంఘం నాయకులు కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో మహిళలు సాంప్రదాయ నృత్యాలు చేశారు. ఆదివాసీ సంఘ నాయకులు వెంకటేష్ హనుమంతరావు కాళీ పటేల్, అత్రం రాజకుమార్ పెండ్రేమ్ రాజేశ్వర్, ఆసునూరి చిన్నయ్య, పిట్టల రాజ్యం పాల్గొన్నారు.
దండేపల్లి : ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఆద్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా అంబేద్కర్ గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆదివాసీల జెండా ఆవిష్కరించి సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం ఆదివాసీ కోట్నాక తిరుపతి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కనక జంగు, రాయిసెంటర్ జిల్లా నాయకుడు రాము, పద్మలపురి కాకు ఆలయ చైర్మన్ కుడిమేత సోము పాల్గొన్నారు.
మంచిర్యాల : పట్టణంలోని వైశ్య భవన్‌లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. మంచిర్యాల జాయింట్ కలెక్టర్ సభవత్ మోతిలాల్ ముఖ్య అతిధిగా హాజరై ర్యాలీని ప్రారంబించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తా నుంచి వైశ్య భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మడవి గంగారాం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకే రవి, ఆదివాసీ సంఘాల నాయకులూ మడవి వెంకటేష్, పెద్ది భార్గవ్, వెడ్మ కిషన్, గుర్రాల రాజవేను పాల్గొన్నారు.