‘జల్, జంగిల్, జమీన్ హమారా’ ఇది ఆదివాసీల ఆత్మగౌరవ నినాదం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశా బ్దాలు గడుస్తున్నా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా వారి బతుకుల్లో వెలుగు కనప డటం లేదు. విద్యా, వైద్య, ఉపాధి ఊసే లేదు. రెండు రోజు ల కిందట ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్‌లో జరిగిన నా గోబా దర్బార్‌కు వెల్లువలా వచ్చి పడిన వినతులే దీనికి సజీ వ సాక్ష్యాలు. ఏండ్లుగా ఇలాంటి దర్బారులు ఎన్ని జరిగినా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది తెగలకు చెందిన నాయకులు మంత్రి సీతక్క ముందు తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు.
ఒక్క ఆదిలాబాద్‌లోనే కాదు రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఆదివాసీల దుస్థితి ఇది. అడవి బిడ్డల ప్రధాన సమస్య భూమి. వారు సాగు చేసే భూమికి హక్కు పత్రాలు కావాలి. 2006లో యూపీఏ 1 ప్రభుత్వ హయాంలో వామపక్షాల డిమాండ్లలో భాగంగా అటవీ హక్కుల గుర్తిం పు చట్టం వచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పైసా ఖర్చు పెట్టకుండా అమలు చేయగలిగిన చట్టం ఇది. భూమి కోసం ఎక్కడో వెతకాల్సిన పని లేదు. ఎవరి దగ్గరో కొనా ల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇప్పటికే వారు సాగు చేసుకుంటున్న భూమిపై వారికి హక్కు కల్పించడం మాత్ర మే ప్రభుత్వం చేయాల్సింది. అయినా ఇది ఎక్కడా అమలు చేయడం లేదు. అడవులను కార్పొరేట్లకు దోచి పెట్టడం కోసం జరుగుతున్న కుట్రలో భాగమే ఇది. మోడీ అయితే ఆయా రాష్ట్రాల్లో తన అనుంగు మిత్రులకు అటవి భూమిని అప్పనంగా పంచిపెడుతున్నాడు. దీనికి ఎలాంటి అడ్డం కులూ రాకుండా చట్టంలో అవసరమైన మార్పుచేర్పులు చేసుక్కుర్చున్నాడు. దీని వల్ల దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఆదివాసీలు అమ్మలాంటి అడవికి దూరమై పోతున్నారు.
ఇక ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జి.ఓ నెంబర్ 3 తీసుకొచ్చారు. కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కోర్టుమెట్లెక్కి కూర్చుంది. అయితే పార్లమెంట్‌లో ఆర్డినెన్స్ తీసుకొచ్చి చిటికెలో దీన్ని అమలు చేసే సత్తా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. తన వద్ద అంతటి భారీ మెజారీటీ ఉన్నా మోడీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయ డం లేదు. అంటే ఆదివాసీలంటే ఎంతటి చిన్న చూపుందో, కార్పొరేట్లపై ఎంతటి మోజుందో తెలిసిపోతుంది. ఏది ఏమైనా నోరు లేని ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని కేంద్రం వారి హక్కులన్నీ కాలరాస్తున్నది. పచ్చని అడవులన్నీ మింగేస్తుంది. కార్పొరేట్లకు పంచిపెడుతూ గిరిపుత్రుల కడుపు కొడుతోంది. ఇప్పుడు రాష్ట్రం తరపున రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దీని అమలుకై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నమ్మకంతోనే ఆదివాసీలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారనేది గుర్తు పెట్టుకోవాలి.
ఇక రాష్ట్రాన్ని మొన్నటివరకు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారమంటూ ఆదివాసీలకు తీవ్ర నష్టం చేసింది. అలాగే వారి జీవనాధారమైన హక్కు పత్రాలు ఇవ్వ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రాష్ట్ర వ్యాప్తంగా పద మూడు లక్షల మందికి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉండగా, నాలుగున్నర లక్షల మందికే ఇచ్చి చేతులు దులుపుకుంది. దానికి మూల్యం కూడా భారీగానే చెల్లించుకుంది. ఇప్పటి వరకు గిరిజనుల అభివృద్ధి కోసమంటూ ఎన్నో దర్బార్లు జరుగుతూనే ఉన్నాయి. మనమూ చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదు. వినతులు అందుకున్నంత మాత్రానా సమస్యలకు పరిష్కారం దొరకుతుందనుకుంటే అది కేవలం మన భ్రమే. వారు సాగు చేసుకుంటున్న భూమి వారికే దక్కాలి. ‘జల్, జంగిల్, జమీన్ హహారా’ అనే వారి ఆత్మగౌరవ నినాదాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అడవిపై కన్నేసిన మోడీ ప్రభుత్వ పెత్తనాన్ని అణగదొక్కాలి. అడవి నుండి అన్యాయంగా తరిమేయ బడుతున్న ఆదివాసీ బిడ్డలను అక్కున చేర్చుకోవాలి. అడవి వారిదే అనే నమ్మకాన్ని కల్పించాలి. గిరిజనుల సమగ్రాభి వృద్ధిపై దృష్టి పెట్టాలి. ఈ బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే.
తెలంగాణ గడ్డ ఆదివాసీ పోరాటాల గడ్డ. ఆధిపత్యా నికి వ్యతిరేకంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వాదు లతో పోరాడి ప్రాణాలర్పించిన రాంజీగోండు పుట్టిన నేల ఇది. తెలంగాణ ఆదివాసీల ఆత్మ గౌరవ పతాక, సాయుధ తెలంగాణ పోరాట యోధులు కొమరం భీం, సోయం గంగూలు వార సులు వీరంతా. ఈ పోరాట చరిత్రను పాల కులు గుర్తు పెట్టుకోవాలి. ఇన్నేండ్లూ అభివృద్ధికి నోచు కోని ఆదివాసీలు ప్రస్తుత రేవంత్ ప్రభు త్వంపై గంపెడంత ఆశపెట్టుకున్నారు. దీన్ని నిలబెట్టుకో వల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే. అలాగే తన ఎన్నికల ప్రచారాన్ని ఆదివాసీ ప్రాంతమైన ఇంద్రవెల్లి నుండి ప్రారంభించి ముఖ్యమంత్రైన విషయాన్ని ఆయన ఎన్నటికీ మర్చిపోరాదు. గిరిపుత్రుల పట్ల కేంద్ర అనుసరిస్తున్న వినాశనకర విధానాలకు వ్యతిరేకంగా తన గళాన్ని ఎక్కుపెట్టాలి. అలాగే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ‘మేం అధికారంలోకి వస్తే అందరికీ హక్కు పత్రాలు అందిస్తాం’ అని హమీ ఇచ్చారు. కాబట్టి పార్లమెంటు ఎన్నికల లోపు దీనికోసం ఓ రోడ్ మ్యాప్ తయారు చేసి లబ్దిదారులను గుర్తిసే అప్పుడు గిరిపుత్రుల విశ్వాసాన్ని పొందగలరు.