– ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం
నవతెలంగాణ-ఇంద్రవెల్లి
జైనూర్ సంఘటనల దృష్ట్యా ఆదివాసీలు శాంతియుత మార్గములో నడవాలని ఎస్పీ గౌస్ ఆలం హితవు పలికారు. బుధవారం మండలం లోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్‌లో ఆదివాసీ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైనూర్ మండలములో ఆదివాసీ మహిళాపై జరిగిన అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి చట్ట పరమైన చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా జైనూర్‌లో జరిగిన అల్లర్లపై దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుబోతుందన్నారు. సోషల్ మీడియా, వాట్సాప్‌లో వచ్చే వదంతులు నమ్మవద్దని సూచించారు. వీటిలో షేర్ చేసే ప్రతి అంశం నిజం కాదన్నారు. ఆదివాసులు సంయమానం పాటించి, జరుప బోయే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమములో ఆదివాసీ పెద్దలు సీడం భీంరావ్, బీఎడ్. ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, పటేల్ వెంకట్రావ్, చిన్ను పటేల్, జుగాది పటేల్ సార్ మేడి, డీఎస్పీ నాగేందర్, గిరిజన పెద్దలు పాల్గొన్నారు.న