నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట ఎమ్మార్వో ఆఫీసు సమీపంలోని శ్రీవిశ్వనాధ స్వామి ఆలయానికి స్ధానిక సీతారామ పురంలో వున్న రెండెకరాల 37 గుంటల భూమి కౌలుకు గురువారం ఉదయం 10.30 కు వేలం పాట నిర్వహించగా రైతులెవ్వరూ హాజరు కాలేదు. వేలంపాట కోసం 10 వేల రూపాయలు డిపాజిట్ చెల్లించవలసి వుండగా ఎవ్వరూ ముందుకు రాలేదు.ఈ సందర్భంగా వేలంపాటను జూలై నెల 18 వ తేదికి వాయిదా వేస్తున్నట్లు నల్గొండ డివిజన్ దేవాలయాల ఇన్‌స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఆలయ ఇవొ లక్ష్మణరావు తెలిపారు. స్థానికంగా వున్న దేవాలయాలకు ఆలయ కమిటీ లు లేవని పలువురు భక్తులు తెలిపారు.ఇవొలకు పనిభారం పెరిగింది.తాను ఒక్కడే 18 ఆలయాల నిర్వహణ భాధ్యతలను చూడవలసి వస్తుందని, అందుకే ఆలయానికి సంబంధించిన సమాచారం అందించలేక పోతున్నట్లు ఇవొ లక్ష్మణరావు ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ వేసి భూమి కౌలుకు రైతులను ఒప్పించాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వలివేటి వీరభధ్రశర్మ పాల్గొన్నారు.