– ప్రజాపాలన ప్రారంభం నేపథ్యంలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రజాపాలన ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నిర్వహించతలపెట్టిన టీజీవో రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఈనెల 31కి వాయిదా వేస్తున్నట్టు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం, అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఇందులో ఉద్యోగులు, అధికారులు బాధ్యతాయుతంగా పాల్గొనాలని తెలిపారు. ప్రజలకు మెరగైన పాలన అందించేందుకు అండగా నిలవాలని సూచించారు. ఈనెల 31న టీజీవో కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలపై తీర్మానం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, వారి ప్రతినిధులు, కేంద్ర కార్యవర్గ సభ్యులు విధిగా హాజరు కావాలని కోరారు.