– ప్రయాణికులు ఇబ్బంది పడకుండా పోలీస్ శాఖ సూచించిన మార్గాలలో ప్రయాణించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 10వ తేదీ నుండి వచ్చే నెల 15వ తేదీ వరకుఅడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జి పనులు జరుగుతున్న వాహనదారులు, కొన్ని భారీ వాహనాలు, ఇతర వాహనాలు రైల్వే పని జరుగుచున్న బ్రిడ్జ్ వరకు తెలియకుండా చేరుకొని ఇబ్బంది పడుచున్నారు అని నిజామాబాద్ ట్రాఫిక్ సహాయ కమిషనర్ నారాయణ బుధవారం తెలిపారు. భారీ వాహనదారులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పోలీస్ శాఖ సూచించిన, తెలిపిన మార్గాల ద్వారా తమ ప్రయాణాలు సాగించగలరని కోరుతున్నామన్నారు. భారీ వాహనాలు నిజామాబాద్ నుండి ఆర్మూర్ భారీ వాహనాలు, డిచ్పల్లి హైవే (NH-44) పైనుండి ఆర్మూర్ చేరుకోవాలి, అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే భారీ వాహనాలు డిచ్పల్లి హైవే (NH-44) పైనుండి నిజామాబాద్ నగరానికి చేరుకోవాలి అని తెలియజేశారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు మాత్రము ఆర్మూర్ వెళ్లడానికి చిన్నాపూర్, కల్లేడి, ఆలూర్ గ్రామాల మీదుగా ఆర్మూర్ చేరుకో వాలనీ, అలాగే ఆర్మూర్ నుండి నిజామాబాద్ వచ్చే ఆర్టిసి బస్సులు యదావిదిగా నిజామాబాద్ నగరానికి చేరుకోవాలి తెలియజేశారు. కావున వాహనదారులు విషయాన్ని గమనించి ప్రయాణాలను పోలీస్ లు సూచించిన మార్గాలలో కొనసాగించాలని కోరారు.