గంపెడు ఆశలు, ఆకాశానంటే ధరలు
వద్దని అనుకోలేము
కొనకుండా ఉండలేము.
దినం దినం కొత్తదనం రోజుకు ఒక గండం.
ధరలు పెరిగినట్టు జీతం పెరగదాయే.
తరగతి తర్వాత తరగతి ఉంటుంది
మా మధ్యతరగతికే
జీవితం మొత్తం తరగని మధ్యతరగతే.
పండుగా పబ్బాలకు కొదువేలేదు
పలకరించని చుట్టం లేదు
సంతోషాలను కొనలేము
కష్టాలను అమ్మనూలేము.
కలల సౌధాలకు అంతులేదు
కష్టాల కన్నీళ్లకు తిరుగులేదు
పేదరికానికి దగ్గరకాలేము
ధనికులుగా మారే ధైర్యము చేయలేము .
మధ్యతరగతి అనే సంసారనావలో
కోపం, ఆవేశం. అనురాగం,
ఆప్యాయత, అనుబంధాలను కలగలిపి
సర్దుబాటు చేస్తూ జీవితాలను
సాగిస్తూ ఉంటాం.
– గాజోజు శ్రీనివాస్ 9948483560