పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు

Adjustment of teachers according to the ratio of students in the school– రెండో విడత ఏకరూప దుస్తులు పంపిణిచేయాలి..
– విద్యార్థుల,టీచర్స్ యొక్క హాజరు నివేదిక అందజేయాలి..
– అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తయిన వాటికి నిధుల మంజూరు..
– జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పాఠశాల నందు విద్యార్థుల నిష్పత్తి అణుగునంగా ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు అందరూ సహకరించాలని,ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజువారి హాజరు మెరుగుపరచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో మండల విద్యాధికారులు ,కోఆర్డినేటర్లు, మండల నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో జత ఏకరూప దుస్తులు విద్యార్థులకు వారం రోజులలో అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా చేపట్టే మైనర్ రిపేర్లు సకాలంలో పూర్తి చేయాలని ,నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ తెలిపారు. పనులు పూర్తయిన పాఠశాలలకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. ప్రాథమిక ,ప్రాథమికోన్నత,ఉన్నత  పాఠశాలలో ఉన్న విద్యార్థులు దారలంగా చదవగలగాలి, రాయగలగాలని అలాగే గణితమును నందు చతుర్విధ ప్రక్రియలు తప్పనిసరిగా అందరు విద్యార్థులకు రావాలని, క్రమం తప్పకుండా వర్క్ షీట్లు, ఇంటి పని ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులకు వచ్చే సోమవారం నుండి క్రమం తప్పకుండా ఐదు ఆంగ్ల నూతన పదాలను పరిచయం చేయాలని, స్పెల్లింగ్, అర్థము, ఒక వాక్యం రాయడం రావాలని  అదే వారంలో శనివారం నాడు దానికి సంబంధించిన పరీక్ష నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులను సరియైన మార్గంలో ఉంచి చదువుకు ఎంత దగ్గరగా చేస్తే వారి భావి జీవితంలో ఆర్థికంగా ఎదగగలుగుతారని, క్రమశిక్షణతో పాటు విద్య పట్ల  ఆసక్తిని నాణ్యతను పెంచాలని  కలేక్టర్ కోరారు. జాలి ఫోనిక్స్ అనే స్వచ్ఛంద సంస్థతో ఒప్పందం చేసుకొని జిల్లాలోని ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు మూడు, నాలుగు విడతలుగా, మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారని, ఈ శిక్షణలో ఆంగ్ల భాషా పదాలను ఎలా ఉచ్చరించాలి అనేది సులువుగా విద్యార్థులు నేర్చుకోగలుగుతారని దీనివలన విద్యార్థులు సులువుగా ఆంగ్లభాషలోని పదాలను ఎలా ఉచ్చరించాలో నేర్చుకోగలుగుతారని అన్నారు. మంచి బోధన ద్వారానే అభ్యసన ఫలితాలు సాధ్యపడుతుందని దానికి ఉపాధ్యాయులు అందరూ సరి అయిన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిఇఓ అశోక్ కుమార్, కోఆర్డినేటర్లు ,మండల విద్యాధికారులు ,మండల నోడల్ అధికారులు పాల్గొన్నారు.