నవతెలంగాణ-బడంగ్ పేట్
సమాజ సేవలో భాగంగా ముగ్గురు అనాథ లను చేరదీసినట్టు మాత దేవోభవ అనాథ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు గిరి తెలి పారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మం డలం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని నాదర్‌గుల్ గ్రామ నివాసులు, అబాకస్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అడ్వైసర్స్ సీఓ మర్రి శశాంక్ రెడ్డి ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్ ప్రాంతంలో మతి స్థిమితం లేని ముగ్గురు ఆశ్రమంలో చేరుకున్నట్టు పేర్కొన్నారు. మానవ సేవే మాధవ సేవగా భావించి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంద న్నారు. మర్రి శశాంక్ రెడ్డి అనాథలకు భవిష్యత్‌లో తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇచ్చారు.